2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి గా బల్లి దుర్గాప్రసాద్ టికెట్ ని చేజికిచ్చుకున్నారు. చివరి నిమిషం లో అనూహ్యంగా దుర్గా ప్రసాద్ పేరు తెరమీదకు రావడం ,టికెట్ ఖరారు కావడం ,ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది అని తెలిసిందే, అయితే కరోన తో పోరాడి దుర్గ ప్రసాద్ మరణించడం జరిగిన నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది, ఎవరు అయిన పదవి లో ఉన్నఅభ్యర్థి చనిపోతే వారి కుటుంబ సభ్యులు కి టిక్కెట్ ఇవ్వడం ఆనవాయితి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితు ల్లో దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి కి కానీ ,వారి అమ్మ కి కానీ టికెట్ ఇవ్వాలి. కానీ అనూహ్యంగా అధిష్ఠానం వీరికి టిక్కెట్ ఇవ్వకుండా జగన్ ఫిజియోథెరపిస్టు గురుమూర్తి పేరు తెర మీదకి తీసుకు రావడం ,దాదాపు ఖరారు చేయడం జరిగినట్టే అనుకోవాలి ఇది తథ్యం.
దీనికిపెద్ద గా ఆశ్చర్యా నికి లోను కావలసిన అవసరం లేదు ఎందుకంటే…. దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు కి ఇస్తే వారు గెలిస్తే అది పూర్తిగా సానుభూతి గెలుపు అని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తారని అధిష్టానం భావించి నట్టు ఉంది.ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి వారికి పార్టీ అండ గానే ఉంది అని సంకేతాలు నిన్న జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో బొత్స చేత చెప్పించడం జరిగింది. ఈ నేపధ్యంలో గురుమూర్తి కి టిక్కెట్ వల్ల విధేయత కి జగన్ ప్రాధాన్యత ఇస్తాడాని, సామాన్యుల ను గుర్తింపు ఇచ్చాడని పేరు ఉంటుంది, అలాగే గురుమూర్తి విజయం సాధిస్తే ప్రభుత్వం మీద ప్రజలకు అపార నమ్మకంతో ఉన్నారనే సంకేతాలు వస్తాయి… ఇది పూర్తిగా జగన్ గెలుపు కింది లెక్క కట్టువచ్చు అని అధిష్టానం అనుకుంది ఏమో?అలా ఈ నిర్ణయం కి వచ్చారు అని అనుకోవచ్చు…..అధిష్టానం అంటే ..ఎవరు…. జగన్ కదా ఏదైనా ఈ ఎన్నికలు ఆంధ్రా లో హీట్ పెంచ నున్నాయి..
Comments are closed.