కృష్ణా: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో నే హత్య చేశామని ప్రధాన నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.
మచిలీపట్నం లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో సహకరించిన నిందితులను ఆర్ పేట పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్ చేశారు. భాస్కరరావు హత్య కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ అయినట్లు డీఎస్పీ తెలిపారు.
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ లు కేసు నమోదు చేశామన్నారు. నోటీసులు ఇచ్చేందుకు కొల్లు ఇంటికి వెళ్లిన పోలీసులు, కొల్లు రవీంద్ర లేకపోవడంతో వెనుతిరిగారిన ఆయన తెలిపారు. కొల్లు రవీంద్ర ఆచూకి కోసం 3 బృందాలను నియమించామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.
Comments are closed.