అమరావతి: కరోనా మృతదేహాల తరలింపు, అంత్యక్రియల పై పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో చనిపోయినవారి మృతదేహాలను తమ నివాస ప్రాంతాలకు రానివ్వడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కరోనా మృతుల అంత్యక్రియల్లో ఇబ్బందులు పెట్టొద్దని ఆయన ప్రజలను సూచించారు.
అంతర్రాష్ట్ర రవాణా వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందని అన్నారు. కరోనా వ్యాప్తి రెండు దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టేనని అన్నారు. ప్రభుత్వ వైద్యులపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి తెలిపారు.
Comments are closed.