తాడేపల్లి: లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోవడంతో పేదలకు ఉచితంగా బియ్యం, సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరు విడతలగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏడో విడత కూడా పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల రేషన్‌కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత మార్చి 29 నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేశారు.
ఏడో విడత పంపిణీ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించనుంది. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా అందించనునున్నారు.
Comments are closed.