హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కొండ పోచమ్మ సాగర్ నిర్మాణ పనుల డొల్లతనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనప్పటి నుంచి అందులోని లోపాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు.
తాజాగా కొండపోచమ్మ సాగర్ కాల్వలకు పలు చోట్ల గండ్లు పడడంపై ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా.. ‘‘కొండ పోచమ్మ కథలు.. 2 పనిమంతుడు పందిరేస్తే..పిట్ట వాలి.. పుటుక్కున కూలిందట..! కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి కేసీఆర్ ఫాంహౌస్ కు నిర్మించిన కెనాల్ గండిపడి ‘శివారు వెంకటాపురం’ నిండా మునిగింది. అవినీతి కట్టలు తెగింది. ఇదీ ‘మెగా మేత’ ఘనతే! ఈ కెనాల్ ను ‘జాతిజలగ’ ప్రారంభించి వారమైంది.’’ అంటూ ట్వీట్ చేశారు.
కొండ పోచమ్మ కథలు.. 2 పనిమంతుడు పందిరేస్తే..పిట్ట వాలి.. పుటుక్కున కూలిందట..! కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి కేసీఆర్ ఫాంహౌస్ కు నిర్మించిన కెనాల్ గండిపడి ‘శివారు వెంకటాపురం’ నిండా మునిగింది. అవినీతి కట్టలు తెగింది. ఇదీ ‘మెగా మేత’ ఘనతే! ఈ కెనాల్ ను ‘జాతిజలగ’ ప్రారంభించి వారమైంది. pic.twitter.com/tmMutPwZ2Y
— Revanth Reddy (@revanth_anumula) June 30, 2020
Comments are closed.