ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. పలానా గ్రామం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీలలో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పది లక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50 ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నా దీని వెనక భయానకం దాగి ఉందో కదా.. ఈ లెక్క చెప్పింది ఎవరో కాదండి.
missingఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా కనిపించకుండా పోయిన మహిళలు 14కోట్ల 26లక్షల మంది ఉంటే అందులో కేవలం ఇండియా వారే మూడోవంతు మంది ఉన్నారట. ఇక చైనాలో అయితే ఆ సంఖ్య 7కోట్ల 23లక్షల మంది ఉన్నారట. ఇది వింటుంటే అమ్మో భయంగా ఉంది కదా.. అసలు ఇలా ఇంతమంది మహిళలు ఎందుకు కనిపించకుండా పోయారు. వారంతా ఎక్కడ.. ఎలా ఉన్నారు. అసలు ఎందుకు వీరు ఇళ్లనుంచి వెళుతున్నారు. వారంతా ఎలాంటి కష్టాలు పడుతున్నారన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఆ మహిళలు కనపడకుండా పోవడంతో ఆ కుటుంబాలు ఎంతో ఆవేదనతో ఉన్నాయి.
Comments are closed.