చిత్తూరు: 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సైబర్ నేరాలకు తెరతీసి వ్యాపారులకు టోకరా వేస్తున్న ఘటన జిల్లాలోని మదనపల్లె లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు డింగ్ టోన్ యాప్ ద్వారా సైబర్ మోసాలకు తెరలేపారు.
వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని వారినుంచి వస్తువులను కొనుగోలు చేసి ఆన్లైన్ చెల్లింపులంటూ.. డింగ్ టోన్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ పంపిస్తున్నారు. దీంతో ఇది నిజమేనని నమ్మిన వ్యాపారులు చివరకు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
Comments are closed.