The South9
The news is by your side.
after image

ఎమ్మెల్యే మేకపాటి కృషితో 58 దేవాలయాలకు రూ.580.00 లక్షల నిధులు మంజూరు.

post top

*ఎమ్మెల్యే మేకపాటి కృషితో 58 దేవాలయాలకు రూ.580.00 లక్షల నిధులు మంజూరు*

*: నియోజకవర్గ చరిత్రలో ఇంత భారీస్థాయిలో మంజూరు కావడం ఇదే ప్రధమం*

*: హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు*

 

ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 58 ఆలయాల జీర్ణోద్దరణ, నూతన దేవాలయాల నిర్మాణాల కోసం రూ.580.00 లక్షల నిధులు మంజూరయ్యాయి.

 

తిరుపల తిరుపతిదేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 99 దేవాలయాలకు ఒక్కో దేవాలయానికి రూ.10లక్షల వంతున నిధులు మంజూరు కాగా అందులో 58 దేవాలయాలు ఆత్మకూరు నియోజకవర్గానికి మంజూరు కావడం విశేషం.

 

ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుండి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ దేవాలయాలకు నిధులు మంజూరు కావడం విశేషం.

 

ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో ఇంతటి భారీస్థాయిలో ఆలయాల నిర్మాణాలకు, జీర్ణోద్ధరణలకు నిధులు మంజూరు కావడం ఇదే ప్రధమం కావడం విశేషం.*

 

Post midle

గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటనల సందర్భంగా పలు గ్రామాల ప్రజలు దేవాలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాల గురించి ఎమ్మెల్యే మేకపాటికి విన్నవించడంతో ఆయన నిధులు అవసరమైన జాబితాలను సిద్దం చేయించారు. ఈ జాబితాలను రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులకు పంపి నిధులు మంజూరు చేయాలని కోరడంతో వారు శుక్రవారం నియోజకవర్గంలో 58 దేవాలయాలకు ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షల వంతున నిధులు మంజూరు చేశారు.

 

Post Inner vinod found

ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండలంలో అక్బరాబాదు, హసనాపురం, శ్రీకొలను, కావలియడవల్లి, కుప్పురుపాడు, తెల్లపాడు, తాతారెడ్డిపల్లి, అనుమసముద్రం, శ్రీకొలను, చిన్నబ్బీపురంలలో నూతన దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి.

 

అదే విధంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు, రేవూరు ఈగాపాళెం కాలనీ, అనంతసాగరం, పాతాళపల్లి, బెడుసుపల్లి, గౌరవరం, ఆమనిచిరువెళ్ల, ఇనగలూరు, వరికుంటపాడు, శంకరనగరం, బొమ్మవరం ఆగ్రహారం గ్రామాలలో నూతన దేవాలయాలకు నిధులు మంజూరు కాగా చుట్టుగుంటపల్లి, మంచాలపల్లి గ్రామాలలో పురాతన శ్రీ వీర నారాయణస్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల జీర్ణోద్ధరణ పనుల కోసం నిధులు మంజూరు కావడం జరిగింది.

 

ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు నరసాపురం, శాంతినగరం, ముస్తాపురం, పట్టణంలోని గంగమ్మ తల్లి ఆలయానికి నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా ఆత్మకూరు మండలంలోని నువ్వూరుపాడు, శ్రీనివాసపురం, మురగళ్ల గ్రామాలలో ఆలయాల అభివృద్ది కోసం నిధులు మంజూరు కాగా వాశిలి, బట్టేపాడు, రావులకొల్లు, బండారుపల్లి, బంట్లపల్లి, అప్పారావుపాళెంలలో నూతన ఆలయాల నిర్మాణాలు నిధులు మంజూరయ్యాయి.

 

చేజర్ల మండలంలోని పాతపాడు, చేజర్ల, పాడేరు గ్రామాలలో నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా చిత్తలూరు, కొల్లపనాయుడుపల్లి, తిరుపతినాయుడుపల్లి, యనమదాల, భిల్లుపాడు గ్రామాలలో ఆలయ అభివృద్ది, జీర్ణోద్ధరణ కోసం నిధులు మంజూరు కావడం విశేషం.

 

మర్రిపాడు మండలంలో చిలకపాడు, పెగళ్లపాడు, పోతిరెడ్డిపల్లి, ఏపిలగుంట గ్రామాలలో నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా చుంచులూరు, రామానాయుడుపల్లి, కదిరినాయుడుపల్లి నిధులు మంజూరయ్యాయి.

 

సంగం మండలంలో కొరిమెర్ల, అన్నారెడ్డిపాళెం, మర్రిపాడు, సిద్దిపురం, తలుపూరుపాడు గ్రామాలలో నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా సంగం, కోలగట్ల, తరరుణవాయి మజారా ఉడ్ హౌస్ పేట గ్రామాలలోని ఆలయాల అభివృద్ది కోసం నిధులు మంజూరు అయ్యాయి.

 

ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో దేవాలయాల మంజూరు కావడం నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఇదే ప్రధమం కావడం విశేషం.

 

దీంతో నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల జీర్ణద్దోరణ పనులతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేసిన కృషికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post midle

Comments are closed.