అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. ఈ కొత్తవారితో కలుపుకొని మొత్తం 59.03 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం ఇవాళ (బుధవారం) పింఛన్ డబ్బులను పంపిణీ చేయనుంది.
ఇందుకోసం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు నేటి ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ డబ్బుల పంపిణీ మొదలు పెట్టారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోనున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు వెల్లడించారు.
Comments are closed.