సౌత్ 9 ప్రతినిధి
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలకు పనిచేశారు ఆయన సలహాతో ఎన్నో పార్టీలు ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఆయన ఎన్నిక వ్యూహానికి తిరుగుండగనే చాలామంది అభిప్రాయం అయితే తాను ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలు ఇచ్చేందుకు ఎంత తీసుకుంటారు అనే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు బీహార్ లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషోర్ తన ఫీజు వివరాలు వెల్లడించారు మా ఎన్నికల ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారో చెప్పాలని ప్రజలు నన్ను తరచుగా అడుగుతారని ఆయన పేర్కొన్నారు వివిధ రాష్ట్రాల్లో పది ప్రభుత్వాలు నా వ్యూహాలపై నడుస్తున్నాయి నా ప్రచారానికి టెంటు పందిరి వేయడానికి నా దగ్గర డబ్బులు సరిపోవని మీరు అనుకుంటున్నారా నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే నేను అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు